భీరయ్య స్వామిని దర్శించుకున్న MLA
NEWS Oct 04,2024 06:15 am
జగిత్యాల పట్టణ హనుమాన్ వాడ భీరయ్యా స్వామి దేవాలయంలో టీటీడీ ద్వారా మంజూరైన 10 లక్షల రూపాయల నిధులతో భజన మందిరం నిర్మాణానికి భూమి పూజ చేశారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్. అంతకుముందు ఆలయంలో భీరయ్య స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎమ్మెల్యే. ఈ సందర్భంగా కురుమ సంఘం సభ్యులు.. ఎమ్మెల్యేను సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి, కౌన్సిలర్లు నాయకులు పాల్గొన్నారు.