రాజగోపురం వద్ద అమ్మవారికి పూజలు
NEWS Oct 04,2024 06:12 am
మెదక్ జిల్లా పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయల దివ్య క్షేత్రంలో వరద వీడకపోవడంతో శుక్రవారం అమ్మవారి ప్రధాన ఆలయం తెరుచుకోలేదు. ఎగువ ప్రాంతాల నుంచి జోరుగా వరద ప్రవహిస్తున్నందున జలదిగ్బంధం కొనసాగుతోంది. దాంతో రాజగోపురం వద్దఅమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు చేశారు. దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 2వ రోజు ఈరోజు అమ్మవారు గాయత్రి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు..