ఇద్దరు బాలికలపై ఐదుగురు యువకులు అత్యాచారం
NEWS Oct 04,2024 06:11 am
TG: HYD ఐఎస్ సదన్లోని పునరావాస కేంద్రం నుంచి పారిపోయిన ఇద్దరు బాలికలపై ఐదుగురు యువకులు అత్యాచారం చేశారు. జనగామ, మల్కాజిగిరికి చెందిన 14, 15 ఏళ్ల బాలికలు గత నెల 24న జనగామ బస్టాండ్‌కు చేరుకున్నారు. ఆశ్రయం కల్పిస్తామని నమ్మించి నాగరాజు, సాయి, రాజు, అఖిల్, రోహిత్ వారిపై అత్యాచారం చేసి వదిలేశారు. పోలీసులు అమ్మాయిలను గుర్తించి ఆరా తీయగా విషయం బయటికొచ్చింది. దీంతో నిందితులను అరెస్ట్ చేశారు.