మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలో కలప రవాణా జోరుగా కొనసాగుతోంది. మండలంలోని ఆయా గ్రామలలో అధికారుల అనుమతి లేకుండా కలపను అక్రమార్కులు చెట్లను నరికి సొమ్ము చేసుకుంటున్నారు. అదే పనిగా కొంత మంది వ్యక్తులు కలప చెట్లులను నరికి అక్రమ దందా చేస్తూ తరలిస్తున్నారని ఆయా గ్రామాల ప్రజలు వాపోయారు. ఇప్పటికైనా సంబంధించిన అధికారులు స్పందించి కలప దందాను అరికట్టే విదంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.