ప్రభుత్వాసుపత్రిలో గర్భిణుల పట్ల నిర్లక్ష్యం
NEWS Oct 04,2024 05:36 am
మెట్ పల్లి: గర్భిణీల కుటుంబ సభ్యల కథనం ప్రకారం.. సాయంత్రం ఆపరేషన్ చేస్తామని ఆరుగురు గర్భిణులను సిద్ధం చేసిన వైద్యులు.. ఏసీ పని చేయడం లేదని, రిపేర్ అయిన తర్వాత చేస్తామని చెప్పారు. రాత్రి టైంలో ఏసీ పనిచేస్తుంది ఆపరేషన్ చేయండి అని వైద్యులను సంప్రదించగా, రేపు ఉదయం చేస్తామని నిర్లక్ష్యంగా వెళ్లిపోయిన వైద్యులు. చేసేది ఏమీ లేక గర్భిణులకు ఏదైనా అవుతుందేమో అన్న భయంతో గర్భిణీలను అంబులెన్స్ లో ప్రైవేట్ ఆస్పత్రులకు తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు.