ప్రముఖ నటుడు మోహన్ రాజ్ కన్నుమూత
NEWS Oct 03,2024 05:58 pm
సౌత్ సినిమాల్లో విలన్‌గా నటించిన మోహన్ రాజ్ మోహన్ రాజ్ అనారోగ్యంతో బాధపడుతూ తుది శ్వాస విడిచారు. తెలుగులో లారీ డ్రైవర్, శివయ్య, అసెంబ్లీ రౌడీ, సమరసింహారెడ్డి, చెన్నకేశవరెడ్డి వంటి సినిమాల్లో విలన్ గా నటించారు. మోహన్ రాజ్ దాదాపు 300లకు పైగా సినిమాల్లో నటించారు. ఆయన మృతి పట్ల కేరళ సీఎం పినరయి విజయన్ సంతాపం తెలిపారు.