ఈసారి 11 నుంచి ఒక సీటుకు పరిమితం చేద్దాం..
డిప్యూటీ సీఎం పవన్ పిలుపు
NEWS Oct 03,2024 05:38 pm
సనాతన ధర్మానికి హాని తలపెట్టేవారు జాగ్రత్తగా ఉండాలి. ఈ సారి ఎన్నికలు వస్తే వారిని 11 నుంచి ఒక సీటుకు పరిమితం చేద్దామని తిరుపతి వారాహి సభ నుంచి డిప్యూటీ సీఎం పవన్ పిలుపునిచ్చారు. ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. కలియుగంలో ధర్మానికి ప్రతిరూపం వెంకటేశ్వరస్వామి. హిందూ సమాజాన్ని కులాలు, ప్రాంతాల వారీగా విభజించారు. అంతా ఏకమయ్యే సమయం వచ్చిందని పవన్ అన్నారు.