చేవెళ్ళలో దేవి నవరాత్రి ఉత్సవాలు
NEWS Oct 03,2024 05:27 pm
చేవెళ్ళలో దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా భక్తులకు దర్శనమిచ్చారు. నిర్వాహకులు మంగలి యాదగిరి, సున్నపు ప్రవీణ్, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండపం వద్ద సాంస్కృతిక కార్యక్రమాలతో మోడల్ స్కూల్ విద్యార్థులు అలరించారు. చేవెళ్ల స్థానికులు ఊరడి పాండు భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు.