కల్తీ కల్లు విక్రయాలు అరికట్టాలి
NEWS Oct 03,2024 03:44 pm
హిందూపురం ప్రాంతంలో రోజు రోజుకు పెరిగిపోతున్న కల్తీ కల్లు విక్రయాలను అరికట్టాలని గురువారం ఎపిఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రవికుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రెవెన్యూ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసి రెవెన్యూ అధికారికి వినతి పత్రం అందజేశారు. రవికుమార్ మాట్లాడుతూ.. హిందూపురం మండలం కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో చౌళూరులో కల్తీ కల్లు జోరుగా విక్రయిస్తున్నారని చెప్పారు.