దసరా కానుకగా డబుల్ బెడ్‌రూం ఇళ్లు
NEWS Oct 03,2024 03:38 pm
తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే పూర్తయిన డబుల్ బెడ్ రూంలను అర్హులకు ఈ దసరా కానుకగా అందించబోతున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. తాము అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వం అసంపూర్ణంగా వదిలేసిన అనేక ఇండ్లను 9 నెలల్లోనే పూర్తి చేశామన్నారు. పూర్తయిన ఇండ్లను రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లోని నిరుపేదలకు ఈ దసరా పండుగ కానుకగా అందించబోతున్నట్టు మంత్రి తెలిపారు.