సిడిపి పనులు పూర్తి చేయాలి: కలెక్టర్
NEWS Oct 03,2024 03:42 pm
సిరిసిల్ల: సిడిపి పనులు త్వరితగతిన చేపట్టాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ లో సిడిపి పనుల పురోగతిపై గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. క్షేత్రస్థాయిలో పనులు పూర్తయినప్పటికీ యూసీలు సమర్పించకపోవడం వల్ల ప్రభుత్వ రికార్డులలో పనులు పూర్తికానట్లు ఉన్నాయని పూర్తి చేసిన పనులకు సంబంధించి యుటిలైజేషన్ సర్టిఫికెట్లను సమర్పించాలని ఆదేశించారు.