వైభవంగా శరన్నవరాత్రోత్సవాలు
NEWS Oct 03,2024 03:39 pm
మల్యాల మండలంలో దేవీ నవరాత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మండలంలోని ముత్యంపేట గ్రామంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని విద్యార్థుల కోలాటాలతో, మహిళల ఆటపాటలతో, ఒగ్గు కళాకారుల డప్పు చప్పుల్లతో, పోతరాజుల విన్యాసాలతో ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఈ గ్రామంలో అమ్మవారు కొలువుదీరడం మొదటిసారి కావడంతో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మండల కేంద్రంలోని కొత్తపేటలో కొలువు దీరిన అమ్మ వారు శైలపుత్రీ అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.