భార్య ఆత్మహత్య - భర్త అరెస్ట్
NEWS Oct 03,2024 03:24 pm
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎలుక ప్రాంతానికి చెందిన రాపల్లి సౌమ్య (25) అనే వివాహిత ఈనెల 1న ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు తల్లి లావణ్య ఫిర్యాదు మేరకు భర్తతో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేశారు పట్టణ పోలీసులు. దీంతో మృతురాలు భర్త రాపల్లి రాజేష్ ను గురువారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు DSP రఘు చందర్ తెలిపారు.