జనాభా ప్రాతిపదికన మద్యం దుకాణాల కేటాయింపు
NEWS Oct 03,2024 03:10 pm
హిందూపురంఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల మద్యం దుకాణాలను ఆయా ప్రాంతంలోని జనాభా ప్రాతిపదికన కేటాయించినట్లు ఎక్సైజ్ సీఐ లక్ష్మీ దుర్గయ్య తెలిపారు. ఆయన తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. హిందూపురం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో హిందూపురం, లేపాక్షి, చిలమత్తూరు, పరిగి మండలాలు ఉన్నాయన్నారు. హిందూపురం అర్బన్ ప్రాంతానికి ఆరు మద్యం దుకాణాలను ప్రభుత్వం మంజూరు చేసినట్లు తెలిపారు.