శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తజన సందోహం
NEWS Oct 03,2024 03:22 pm
ప్రపంచ పర్యాటక చిత్రపటంలో పేరెన్నిక గన్న లేపాక్షి వీరభద్రాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తజన సందోహం మధ్యన కన్నుల పండుగగా ప్రారంభమయ్యాయి. వీరభద్రాలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రమానందన్ అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి దసరా ఉత్సవాలను ప్రారంభించారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఉదయం 6 గంటలకు సుప్రభాత సేవతో అమ్మవారికి పూజలు ప్రారంభమయ్యాయి. 8 గంటలకు సప్తశతి పారాయణం, రుద్రాభిషేకం, శ్రీ చక్రవర్చన వంటి విశేష పూజలు నిర్వహించారు.