గ్రామ సభలో పలు తీర్మానాలు
NEWS Oct 03,2024 03:09 pm
టేక్మాల్ మండల కేంద్రంలోని గాంధీ భవన్లో గ్రామ పంచాయతీ కార్యదర్శి రాకేశ్ సమక్షంలో గ్రామ పెద్దల ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలు సమస్యలపై తీర్మానాలు చేశారు. అలాగే గ్రామంలో ఉపాధి హామీ పథకం ద్వారా నిర్వహించాల్సిన పనులపై ఈ సభలో తీర్మానాలు చేసి రాకేశ్‌కు అందచేశారు. ఈ సభలో టేక్మాల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నేతలు, బీఆర్ఎస్ పార్టీ నేతలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు