సూర్యవాహానంపై వెంకటేశ్వర స్వామి
NEWS Oct 03,2024 02:47 pm
మేడిపల్లి మండలం తొంబర్రావుపేటలో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సూర్య వాహన సేవ జరిగింది. మంగళ హారతులతో మహిళలు వెంకటేశ్వర స్వామికి స్వాగతం పలకగా, జయ విజయాలు వెంటరాగా, డబ్బు చప్పులతో వెంకటేశ్వర స్వామిని గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. 9 రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో ఈరోజు స్వామివారు సూర్య వాహనంపై ఊరేగింపుగా వెళ్లారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.