ఉదయనిధికి పవన్ పరోక్ష హెచ్చరిక!
NEWS Oct 03,2024 02:23 pm
సనాతన ధర్మానికి భంగం కలిగితే అవసరమైతే ప్రాణత్యాగం చేస్తానని, డిప్యూటీ సీఎం పదవి పోయినా భయపడబోనని, ధర్మాన్ని రక్షించడం కోసం దేనికైనా సిద్ధమేనని పవన్ కళ్యాణ్ అన్నారు. సనాతన ధర్మం వైరస్ లాంటిదని, ఆ మహమ్మారిని నిర్మూలించాలని ఈ మధ్య ఓ యువ నాయకుడు మాట్లాడుతున్నాడని, సనాతన ధర్మాన్ని ఎవరూ ఏమీ చేయలేరని, దాన్ని నిర్మూలించాలకుంటే, వారే తుడిచిపెట్టుకుని పోతారని, తిరుపతి బాలాజీ సాక్షిగా చెబుతున్నాఅంటూ పవన్ హెచ్చరించారు.