మెడికల్ సీటు సాధించిన ప్రజ్ఞను
సన్మానించిన పద్మశాలి నేతలు
NEWS Oct 03,2024 02:12 pm
మల్లాపూర్‌కి చెందిన ఎర్ర నాగరాజ్ కూతురు ఎర్ర ప్రజ్ఞ MBBSలో సీట్ సాధించిన సందర్భంగా పద్మశాలి మండల అధ్యక్షుడు అయ్యోరి దశరథం, పద్మశాలి నేతలు ఎర్రప్రజ్ఞ ఇంటికి వెళ్లి శాలువాతో సన్మానించారు. ఇలాంటి విజయాలు మరెన్నో సాధించాలని అభినందించారు. కార్యక్రమంలో పద్మశాలి జిల్లా కార్యవర్గ సభ్యుల సాంబరి శంకర్, సిరిపురం రవీందర్, గుజ్జేటి నరసయ్య, మోర సతీష్, ఎర్ర లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.