BCలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి
NEWS Oct 03,2024 02:30 pm
మెట్‌పల్లి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ నాయకులు డిమాండ్ చేశారు. మెట్‌పల్లి పట్టణంలో బీసీ సంఘం నాయకులు సమావేశాన్ని నిర్వహించారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించకపోతే సత్యాగ్రహ దీక్ష చేపడతామని హెచ్చరించారు. బీసీలంతా పార్టీలకు అతీతంగా ఐక్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సమావేశంలో మాజీ ఎంపీపీలు తోగిటి అంజయ్య, వెంకటస్వామి, నాయకులు పుప్పాల లింబాద్రి, రాజేందర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.