శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనం
NEWS Oct 03,2024 02:32 pm
రొళ్ల మండలంలో సుప్రసిద్ధ పురాతన చారిత్రక ఆధ్యాత్మిక మహాక్షేత్రమైన రత్నగిరి కోటలో వెలసిన శ్రీ కాళికాంభ కమటేశ్వర స్వామి వార్ల ఆలయంలో నవరాత్రి పర్వదినాల సందర్భంగా గురువారం అమ్మవారు శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.ఆలయ అభివృద్ధి ట్రస్ట్ వారు భక్తులకు అన్నదానం నిర్వహించారు.