సంబంధం లేదు: రకుల్ ప్రీత్
NEWS Oct 03,2024 02:00 pm
మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్‌పై X లో రకూల్ ప్రీతి సింగ్ ట్విట్ చేసింది. దుర్మార్గమైన పుకార్లు నాతోటి నటీనటులపై మహిళలపై పుట్టించడం బాధాకరం. బాధ్యతాయుతమైన స్థానంలో వున్న మరో మహిళ చేస్తోంది. నేను పూర్తిగా రాజకీయాలకు సంబంధం లేని మనిషిని, నాకు ఏ పార్టీతో, లీడర్‌తో సంబంధం లేదు. నా పేరును మీ రాజకీయాల కోసం, మీ రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం మానేయమని కోరుతున్నాను. సిని తారలను, రాజకీయ పుకార్ల నుంచి దూరంగా వుంచండి. మీరు హెడ్‌లైన్‌లో వుండటానికి మా మీద ఇలాంటి చవకబారు వ్యాఖ్యలను చేయకండి అని తన X అకౌంట్‌లో రాసుకొచ్చారు రకుల్ ప్రీత్ సింగ్.