వైభవంగా దుర్గాదేవి అమ్మవార్ల శోభాయాత్ర
NEWS Oct 03,2024 02:27 pm
శ్రీ దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం అంగరంగ దుర్గ దేవి ల శోభాయాత్రలు. జగిత్యాల జిల్లా కేంద్రంలో నుండి డప్పుచప్పులు, చిన్నారుల వేషధారణలతో అమ్మవార్ల శోభాయాత్ర ప్రారంభమై స్థానిక తహసీల్ చౌరస్తా నుండి, రాం బజార్, కొత్త బస్టాండ్ మీదుగా మండపాలకు తరలించారు. చిన్నారులతో వివిధ వేషధారణ, మహిళలు మంగళహారతులతో, విద్యార్థులు కోలాటాలు ఆడుతూ నృత్యాలు సందడి చేశారు. అమ్మవారి శోభాయాత్ర చూడటానికి భారీగా తరలి వచ్చిన భక్తులతో పట్టణం కిక్కిరిసిపోయింది.