డ్రగ్స్ రహిత ఏపీ మా లక్ష్యం.. టెక్నాలజీతో గంజాయి, మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం
NEWS Oct 03,2024 01:33 pm
ప్రతి జిల్లాలో ఒక నార్కోటిక్ కంట్రోల్ సెల్ ఏర్పాటు చేయనున్నామని హోంమంత్రి అనిత తెలిపారు. గంజాయి నివారణ, కట్టడి చర్యలపై సచివాలయంలో జరిగిన మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆ దిశగా స్టేట్ టాస్క్ ఫోర్స్ విభాగంతో నిఘా వ్యవస్థను మరింత పెంచుతామని, టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసి గంజాయి ఆచూకీ చెప్పిన వారికి రివార్డులిస్తామని హోం మంత్రి అన్నారు.