కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్
NEWS Oct 03,2024 01:30 pm
దసరా కంటే ముందే టీచర్ల నియామక ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక కార్యాచరణతో ఖరీఫ్ ధాన్యం కొనుగోలు చేయాలని, ప్రతి కొనుగోలు కేంద్రానికి ఒక సీరియల్ నెంబర్ కేటాయించాలని, సన్న రకం, దొడ్డు రకం ధాన్యానికి వేరువేరు కౌంటర్, కాంటాలు ఏర్పాటు చేయాలన్నారు. కొనుగోలు సమస్యలు తెలిపేందుకు ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలన్నారు. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల కలెక్టర్లు పాల్గొన్నారు.