మల్లాపూర్: చదువుల తల్లికి సన్మానం
NEWS Oct 03,2024 12:29 pm
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన ఎర్ర నాగరాజు కూతురు ప్రజ్ఞ సూర్యాపేట గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో MBBSలో సీట్ సాధించింది. ఈ సందర్భంగా ఆమెను అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో సాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆమె భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు చేరుకోవాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యూత్ సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.