కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్
NEWS Oct 03,2024 01:30 pm
కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఖరీఫ్ 2024-25 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లు, డీఎస్సీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్, అపాయింట్మెంట్ ఆర్డర్ల ప్రక్రియ, డిజిటల్ సర్వే వంటి పలు అంశాలపై సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.