విశ్రాంత ఉద్యోగులకు మెడికల్ క్యాంప్
NEWS Oct 03,2024 01:42 pm
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రేమలత ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవధికార సంస్థ కార్యదర్శి రాధిక జైస్వాల్ విశ్రాంత ఉద్యోగులకు సిరిసిల్లలో మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి వైద్య పరీక్షలను నిర్వహించారు. ఉద్యోగుల బాగోగులను రాధిక జైస్వాల్ అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు జైల్ సింగ్, రమేష్, యాదగిరి గౌడ్, AGP కీసరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.