సిరిసిల్ల: వృద్ధుల సంక్షేమానికి కృషి
NEWS Oct 03,2024 12:08 pm
వృద్ధుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని అడిషనల్ కలెక్టర్ కీమ్యా నాయక్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వృద్ధులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా అధికారులను సంప్రదించాలని సూచించారు. ఈ సందర్భంగా పలువురు వృద్ధాశ్రమాల బాధ్యులను సన్మానించారు. కార్యక్రమంలో సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, ఏఎస్పీ, డిఎంహెచ్వో తదితరులు ఉన్నారు.