DSC అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన
NEWS Oct 03,2024 01:44 pm
జగిత్యాల జిల్లాలోని DSC అభ్యర్థుల ధ్రువపత్రాల కొనసాగుతుంది. జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంపు టీచర్ భవన్ లో జిల్లా విద్యాధికారి జగన్ మ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపిక చేసిన ఉపాధ్యాయులు మెరిట్ జాబితా ప్రకారం అభ్యర్ధుల ఒరిజినల్ ధ్రువపత్రాలను పరిశీలించి గెజిటెడ్ అధికారులు ధ్రువీకరించిన జిరాక్స్ ప్రతులను తీసుకున్నారు. పత్రాల పరిశీలన కోసం 11 కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పత్రాల పరిశీలన జరుగుతుందని అధికారులు తెలిపారు.