జువ్వాడి రత్నాకర్ విగ్రహ ఆవిష్కరణ
NEWS Oct 03,2024 12:06 pm
మాజీ మంత్రివర్యులు కోరుట్ల పట్టణ అభివృద్ధి ప్రధాత జువ్వాడి రత్నాకర్ రావు విగ్రహ ఆవిష్కరణ జరగనుంది. ఉదయం 10 గంటలకు జరిగే ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్సీలు హాజరవుతున్నారు. వెటర్నరీ కళాశాలలో పబ్లిక్ మీటింగ్ లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వడి నర్సింగరావు ప్రజలను ఆహ్వానించారు.