జగిత్యాల విద్యార్థికి MBBS సీటు
NEWS Oct 03,2024 01:43 pm
జగిత్యాల మండలం ధరూర్ గ్రామానికి చెందిన మ్యాదరి శ్రీనివాస్, వరలక్ష్మి దంపతుల కూతురు మ్యాదరి రేణుక కరీంనగర్ లోని ప్రతిమ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో MBBS సీటు సాధించింది. కొన్ని రోజుల క్రితం రేణుక పెద్దమ్మ వైద్యం అందక మృతి చెందిందని, తన పెద్దమ్మ లాగా నిరుపేదలు ఎవరు వైద్యం అందక చనిపోకూడదు అనే దృఢ సంకల్పంతో కష్టపడి ఎంబీబీఎస్ సీటు సాధించినట్టు రేణుక తెలిపారు.