మున్సిపల్ కార్మికులకు బట్టల పంపిణీ
NEWS Oct 03,2024 12:02 pm
జోగిపేట: లయన్స్ క్లబ్ జిల్లా కార్యదర్శి డాక్టర్ కే. అనంతరెడ్డి మనమరాలు చిన్మయి పుట్టినరోజు సందర్భంగా, కుమారుడు కె. అరుణ్ కుమార్ జ్ఞాపకార్థం జోగిపేట లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక శివాజీ నగర్ ఏరియాలోని ఆయన స్వగృహంలో మున్సిపల్ కార్మికులకు బట్టల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ గూడెం మల్లయ్య, కమిషనర్ తిరుపతి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.