గొల్లప్రోలు SI గా మోహన్ కుమార్
NEWS Oct 03,2024 01:26 pm
తూర్పుగోదావరి జిల్లా కాజలూరు మండలం గొల్లపాలెం పోలీస్ స్టేషన్ ఎస్సైగా ఎం.మోహన్ కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో శాంతి, భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాజకీయ నాయకులు, ప్రజల సహకారంతో చర్యలు తీసుకుంటామన్నారు. చోరీల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. స్టేషన్ సిబ్బంది ఘన స్వాగతం పలికారు.