అమ్మవారికి నైవేద్యంగా 95 కిలోల నేతి లడ్డూ
NEWS Oct 03,2024 01:25 pm
తూర్పుగోదావరి జిల్లా కడియం శ్రీదేవి చౌక్ సెంటర్లో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. అదే గ్రామానికి చెందిన ఎన్. నానాజీ అమ్మవారిపై భక్తిని చాటుకుంటూ 5 కిలోల జీడిపప్పుతో అమ్మవారి ముఖ రూపంతో 95 కిలోలతో తయారుచేసిన నేతి లడ్డూను నైవేద్యంగా సమర్పించారు. 10 రోజులపాటు లడ్డును అమ్మవారి వద్ద ఉంచనున్నట్లు కమిటీ సభ్యులు వెల్లడించారు.