కొండా సురేఖ మాటలు ఆడజన్మకే కళంకం
NEWS Oct 03,2024 01:19 pm
జగిత్యాల: మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు మాజీ జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత. కొండా సురేఖ వ్యాఖ్యలపై మాట్లాడాలంటే అసహ్యం వేస్తుందన్నారు. ఆమె మాటలు ఆడజన్మకే కళంకమని, కాంగ్రెస్ పాలన వైఫల్యాలను డైవర్ట్ చేసేందుకే సీఎం మంత్రులతో ఇలా మాట్లాడిస్తున్నారని దావ వసంత విమర్శించారు. జగిత్యాల బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడారు.