అన్నను చంపిన కేసులో విక్రం అరెస్ట్
NEWS Oct 03,2024 01:21 pm
జగిత్యాల రూరల్ మండలం అంతర్గంలో ఆస్తి తగాదాల వల్ల మంగళవారం అన్న విద్యాసాగర్‌ను రోకలి బండతో కొట్టి హత్య చేసి పారిపోయాడు తమ్ముడు విక్రమ్. బుధవారం నిందితుడు విక్రమ్ ను అంతర్గం శివారులో పట్టుకున్నట్లు జగిత్యాల డీఎస్పీ రఘు చందర్ తెలిపారు. నిందితుని వద్ద నుండి హత్యకు ఉపయోగించిన రోకలిబండ స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపినట్లు తెలిపారు.