దుర్గామాత దీక్ష తీసుకున్న 250 మంది
NEWS Oct 03,2024 12:17 pm
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో గణేష్ నవదుర్గ మండలి త్రిశక్తి మాత ఆలయంలో భక్తులు దుర్గామాత దీక్ష తీసుకున్నారు, కొలిచిన వారికి కొంగుబంగారంగా ఈ ఆలయం ప్రసిద్ధిగాంచింది. సుమారు 47 సంవత్సరాలుగా ఈ ఆలయంలో దుర్గామాత దీక్ష తీసుకునే భక్తుల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉన్నారు. ఈసారి అత్యధికంగా 250 మంది దీక్ష తీసుకున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 9 రోజులపాటు దీక్షలో ఉండి అనంతరం దీక్ష విరమింప చేస్తారు.