ఘోరమైన ఇన్సల్ట్ - లైఫ్‌లో వినలేదు
NEWS Oct 03,2024 07:35 am
కొండ సురేఖ సమంతకు మాత్రమే సారీ చెప్పింది.. కానీ నాగార్జునని, ఆయన ఫ్యామిలీని అవమానించింది. కుటుంబ పరువు తీసేలా మాట్లాడింది, అలాంటి ఆమెను ఊరికి వదిలి పెట్టకండి.. గుణ పాఠం నేర్పాలి అంటూ వర్మ ట్విట్ చేశారు. ఇలాంటి ఘోరమైన ఇన్సల్ట్ నేను నా జీవితంలో వినలేదున్నారు. మరోవైపు కొండా సురేఖ సారీ చెప్పింది కదా.. టాలీవుడ్ ఈ విషయాన్ని వదిలేస్తే మంచిదన్నారు టీపీసీసీ చీఫ్. మరో వైపు నాగార్జున కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపించేందుకు రెడీ అవుతున్నాడని సమాచారం.