పారిశుద్ధ్య కార్మికులకు కొత్త బట్టలు
NEWS Oct 03,2024 07:39 am
మెట్‌పల్లి: దసరా పండగ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు కొత్త బట్టలు పంపిణీ చేశారు 26వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ చర్లపల్లి లక్ష్మి. తమ వార్డులోని పారిశుద్ధ్య కార్మికులు డ్రైవర్ లంక శ్రీకాంత్, ఉల్లెందుల మొగులవ్వ, లోకిని గంగ పోచయ్య, బాల్క రాజనర్సయ్య, చిట్యాల రమేష్ లకు దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నిత్యం పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి పారిశుద్ధ్య కార్మికులు నిరంతరం కృషి చేస్తున్నారంటూ వారి సేవలను కొనియాడారు. పారిశుద్ధ్య కార్మికులకు అండగా ఉంటామన్నారు.