ఇక చాలు ఆపేయండి: పీసీసీ చీఫ్
NEWS Oct 03,2024 07:15 am
మంత్రి కొండా సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నప్పటికీ.. కొందరు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆమెపై విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఇక ఆపేయండి అంటూ టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ సినీ పరిశ్రమకు విజ్ఞప్తి చేశారు. ఈ అంశంలో ఇరువైపులా బాధితులు మహిళలేనని అన్నారు. బీఆర్ఎస్ ట్రోలింగ్ వల్ల సురేఖ చాలా బాధ పడ్డారని, ట్రోలింగ్ అంశాన్ని సైతం సినీ పెద్దలు పరిగణలోకి తీసుకోవాలని, తన వ్యాఖ్యలను సురేఖ బేషరతుగా ఉపసంహరించుకున్నట్లు తెలిపారు.