డిజిటల్ ఫ్యామిలీ హెల్త్ కార్డుల
సర్వేను పరిశీలించిన కలెక్టర్
NEWS Oct 03,2024 07:17 am
జగిత్యాల రూరల్ మండలంలోని అంతర్గాం ఒడ్డెర కాలనిలో జరుగుతున్న డిజిటల్ ఫ్యామిలీ హెల్త్ కార్డుల సర్వేను కలెక్టర్ సత్య ప్రసాద్ గురువారం పరిశీలించారు. డిజిటల్ ఫ్యామిలీ హెల్త్ కార్డులకు కుటుంబ వివరాలను తప్పులు లేకుండా పక్కాగా నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్ తదితర అధికారులు పాల్గొన్నారు.