ఆలయ ప్రాంగణాల్లో పారిశుద్ద్యం
NEWS Oct 03,2024 07:02 am
శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో దేవి నవరాత్రులు ప్రారంభోత్సవం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ త్రిశక్తి దేవాలయ పరిసరాల్లో పారిశుద్ధ్య పనులను మున్సిపల్ కమిషనర్ టి మోహన్ పర్యవేక్షించారు. కమిషనర్ దుర్గామాతను ప్రతిష్టించే ప్రతి వార్డులో పారిశుద్ధ్య పనులు చేపడుతున్నామని, ఆయా పరిసరాల్లో నిత్యం క్లీనింగ్ చేయాలని మున్సిపల్ సిబ్బందికి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి సానిటరీ ఇన్స్పెక్టర్ రత్నాకర్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ విష్ణు ముజీబ్ నిజాం పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.