జాతీయఅవార్డు కోసం జానీకి బెయిల్
NEWS Oct 03,2024 06:36 am
కొరియోగ్రాఫర్ జానీకి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది రంగారెడ్డి జిల్లా కోర్టు. అక్టోబర్ 6 నుంచి 10 వరకు బెయిల్ ఇవ్వగా, 11వ తేదీ కోర్టులో లొంగిపోవాల్సి ఉంటుంది. జానీకి కొరియోగ్రాఫర్ కేటగిరీ కింద జాతీయ అవార్డ్ ప్రకటించింది కేంద్రం. ఈ అవార్డ్ అందుకోవటం కోసం జానీకి అవకాశం కల్పిస్తూ.. కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.