బీర్పూర్ వంతెనను పరిశీలించిన MLA
NEWS Oct 03,2024 06:38 am
బీర్పూర్ మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై ప్రమాదకరంగా ఉన్న వంతెనను జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వంతెన పరిస్థితిని గతంలో స్థానికులు తన దృష్టికి తీసుకువచ్చారని, వంతెన మరమ్మతుల కోసం జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడానని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా తక్షణ మరమ్మత్తు పనులు ప్రారంభం అయ్యేలా చూస్తానని చెప్పారు.