హత్యలకు సుపారీ గ్యాంగ్ ప్లాన్?
NEWS Oct 03,2024 07:07 am
జగిత్యాల జిల్లా కధలాపూర్ మండలం చింతకుంట గ్రామ యువకుడు మల్లేశం అదృశ్యం కాగా ఆయన బైక్‌ను వరదకాలువ వద్ద గుర్తించారు కథలాపూర్ పోలీసులు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు సూపరీ గ్యాంగ్ ప్రమేయంపై ఆరా తీస్తున్నారు. జగిత్యాలకు చెందిన ఓ గ్యాంగ్‌తో ఇద్దరి హత్యలకు ప్లాన్ చేసినట్టు సుపారీ గ్యాంగ్ ఆడియో బలం చేకూరుస్తోంది. దీంతో పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు కథలాపూర్ పోలీసులు.