చదువుల తల్లికి సన్మానం
NEWS Oct 03,2024 05:16 am
మెట్‌పల్లి మండలం వెంపేట గ్రామానికి చెందిన మారు రామ్ రెడ్డి కుమార్తె మారు హైందవి ప్రభుత్వ వైద్య కళాశాల మంచిర్యాలలో సీటు సాధించిన సందర్భంగా గ్రామానికి చెందిన నాయకులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లూరి మహేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ మారంపెల్లి శ్రీనివాస్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. హైందవి మరిన్ని ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తీసుకు రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన అల్లూరి సురేందర్ రెడ్డి, మారు వెంకట్ రెడ్డి ఉన్నారు.