రుణమాఫీ చేయాలంటూ రైతుల అభ్యర్థన
NEWS Oct 03,2024 05:14 am
జగిత్యాల: తమకు రుణమాఫీ అమలు చేయాలంటూ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను రాయికల్ మండలం మహితపూర్ గ్రామ రైతులు అభ్యర్థించారు. మైతాపూర్ గ్రామంలో దాదాపు 200 మంది పైడుమడుగు ఇండియన్ బ్యాంకులో రుణాలు పొందారని, ఆ బ్యాంకులో మెజారిటీ శాతం రైతులకు రుణమాఫీ అమలు కాలేదని, రుణమాఫీ అమలు చేసే విధంగా కృషి చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు. స్పందించిన ఎమ్మెల్యే రుణమాఫీ అమలు చేసి విధంగా కృషి చేస్తానన్నారు.