వర్ణరంజితంగా ఊరూవాడ బతుకమ్మ
NEWS Oct 02,2024 05:32 pm
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పూల పండుగ బతుకమ్మ సంబురాలు మొదలయ్యాయి. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఆడపడుచులంతా ఆడిపాడే పండుగ. తొలిరోజు జరిగే ఎంగిల పూల బతుకమ్మ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా షురూ అయ్యాయి. పూల వనాలే నడిచివచ్చాయా అన్నంత వర్ణరంజితంగా ఊరూవాడ బతుకమ్మ ఆడిపాడారు. నెక్లెస్‌రోడ్డులో మంత్రి సీతక్క బతుకమ్మ చుట్టూ ఆడిపాడారు.