ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
NEWS Oct 02,2024 04:57 pm
మెట్‌పల్లి బార్ అసోసియేషన్‌లో బుధవారం గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా అధ్యక్షులు పుప్పాల లింబాద్రి మాట్లాడుతూ.. నాడు గాంధీజీ చేసిన పోరాటాలు, ఉద్యమాల వల్లే నేడు మనం స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలతో జీవిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఎలుముల రాంబాబు, సీనియర్ న్యాయవాదులు మగ్గిడి వెంకట్ నర్సయ్య, వొజ్జెల శ్రీనివాస్, రాంపల్లి జగన్, తదితరులు పాల్గొన్నారు.